Saturday, February 21, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంమదురో దంప‌తుల‌ను విడుద‌ల చేయాలి: ‘సిలియా ఫోర్స్‌ ఫర్‌ పీస్‌’ డిమాండ్‌

మదురో దంప‌తుల‌ను విడుద‌ల చేయాలి: ‘సిలియా ఫోర్స్‌ ఫర్‌ పీస్‌’ డిమాండ్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: వెనిజులా అధ్యక్షుడు మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్‌ను విడుదల చేయాలని ‘సిలియా ఫోర్స్‌ ఫర్‌ పీస్‌’ డిమాండ్‌ చేసింది. శుక్రవారం కారకాస్‌లోని సైమన్‌ బొలివర్‌ థియేటర్‌ వేదికగా ఈ సమావేశం జరిగింది. వారిని విడుదల చేసేంతవరకు ఆందోళన చేపడతామని ఈ మహిళా ఉద్యమం ప్రతిజ్ఞ చేసింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ మహిళ, జర్నలిస్ట్‌ సైర్‌ శాంటోస్‌ అమరల్‌ అధ్యక్షత వహించారు. జోసెఫా జోక్వినా సాంచెజ్‌ వుమెన్స్‌ మూవ్‌మెంట్‌ సహా పలు సామాజిక సంస్థలకు చెందిన వేలాదిమంది మహిళలు ఈ సమావేశంలో భాగస్వామ్యమయ్యాయి. జనవరి 3న మదురో, సిలియా ఫ్లోర్స్‌ను అమెరికా సైన్యం కిడ్నాప్‌ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి వారు అమెరికా కస్టడీలోనే ఉన్నారు.

వైస్‌ అడ్మిరల్‌, కారకాస్‌ మేయర్‌ కార్మెన్‌ మెలెండెజ్‌ మాట్లాడుతూ..ఈ సమావేశాన్ని పోరాడే మహిళల పున:కలయికగా అభివర్ణించారు. వారి విడుదల కోసం వెనిజులా ప్రజలు ఐక్యంగా నిలిచారని అన్నారు. అమెరికా దాడిని, మదురో దంపతులను కిడ్నాప్‌ జరిగిన జనవరి 3ని బ్లాక్ డేగా అభివర్ణించారు. అమెరికా దళాలు ప్రయోగించిన క్షిపణులు, బాంబుల శబ్దాలతో వెనిజులా ” ఎలా కంపించి, ప్రతిధ్వనించిందో” గుర్తుచేసుకున్నారు. ఆ రోజు నుండి వెనిజులా ప్రజలు మదురో దంపతులను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ నిరంతరం ర్యాలీలు చేపడుతున్నారని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -