Tuesday, December 30, 2025
E-PAPER
Homeతాజా వార్తలువివిధ కోర్సుల ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల తేదీలు విడుద‌ల‌

వివిధ కోర్సుల ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల తేదీలు విడుద‌ల‌

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: వివిధ కోర్సుల‌కు సంబంధించిన ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల తేదీల‌ను తెలంగాణ ఉన్న‌త విద్యామండలి విడుద‌ల చేసింది. ఈమేర‌కు మంగ‌ళ‌వారం హైయ‌ర్ ఎడ్యూకేష‌న్ ఛైర్మ‌న్ ప్రొపెస‌ర్ వీ బాల కిష్టారెడ్డి, కార్య‌ద‌ర్శి శ్రీ‌రామ్ వెంకటేష్ వివ‌రాలు వెల్ల‌డించారు. వ‌చ్చే ఏడాది మే నుంచి జూన్ మూడు వ‌ర‌కు వివిధ కోర్సుల కోసం నిర్వ‌హించే సెట్‌ల ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నున్నాయి.

బీఈ, బీటెక్, బీ ఫార్మ‌సీ, ఫార్మ డీ త‌దిత‌ర కోర్సుల్లో ప్ర‌వేశానికి నిర్వ‌హించే TG EAPCET వ‌చ్చే ఏడాది మే 4నుంచి11 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్నాయి. మే 4,5 ఫార్మా, అగ్రీకల్చ‌ర్ సంబంధించిన ప‌రీక్ష‌ల‌ను, మే 9,10,11న ఇంజ‌నీరింగ్‌కు సంబంధించిన ఎంట్ర‌న్స్ ఎగ్జామ్ జ‌ర‌గ‌నుంది. జూన్ 3న నిర్వ‌హించే TG PECETతో ఎంట్ర‌న్స్ ఎగ్జామ్స్ ముగియ‌నున్నాయి.

బీఈడీ కోర్సుకు సంబంధించిన TG EDCET మే 12,
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుకు సంబంధించిన TG ICET మే 13,14.

TG LAWCET మే 18.

TG PGLCET, TG ECET మే 15.

TG PGECET మే 28,31.

TG PECET మే 31, జూన్ 03.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -