Monday, January 12, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసన్న ధాన్యం కొనుగోళ్ల నిధులు విడుద‌ల‌

సన్న ధాన్యం కొనుగోళ్ల నిధులు విడుద‌ల‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: సంక్రాంతి నేప‌థ్యంలో తెలంగాణ రైతాంగానికి రేవంత్ స‌ర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల హామీలో భాగంగా ప్రకటించిన ‘సన్న వరి ధాన్యానికి క్వింటాల్‌కు రూ. 500 బోనస్’ పథకానికి సంబంధించి పౌరసరఫరాల శాఖ తాజాగా నిధులను విడుదల చేసింది. సన్న ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వం మొత్తం రూ. 1,429 కోట్ల రూపాయలను విడుదల చేయడం గమనార్హం.కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతుల వివరాలను నమోదు చేసి, నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకే ఈ బోనస్ మొత్తాన్ని జమ చేస్తున్నారు. ఎక్కడా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా ఈ ప్రక్రియ సాగుతోంది. పండుగ ఖర్చుల సమయంలో ఈ నగదు చేతికి అందడం పట్ల గ్రామీణ ప్రాంతాల్లో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -