Thursday, May 22, 2025
Homeతాజా వార్తలుమోహన్‌లాల్ పుట్టినరోజున 'వృషభ' ఫస్ట్ లుక్ విడుదల

మోహన్‌లాల్ పుట్టినరోజున ‘వృషభ’ ఫస్ట్ లుక్ విడుదల

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: మళయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ బుధవారం తన 65వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా, ఆయన నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘వృషభ’ నుంచి ఫస్ట్ లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో మోహన్‌లాల్ భీకరమైన యోధుడి అవతారంలో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. బంగారు-గోధుమ వర్ణంలో డ్రాగన్ పొలుసుల వంటి నమూనాలతో  రూపొందించిన కవచం ధరించి, పొడవాటి జుట్టు, దట్టమైన గడ్డం, నుదుట తెల్లటి తిలకంతో ఆయన లుక్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. సంప్రదాయ ఆభరణాలు, ముక్కుపుడకతో ఆయన గంభీరమైన రాచరికపు వీరుడిలా కనిపించారు. ఈ ఫస్ట్ లుక్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్న మోహన్‌లాల్, “ఇది చాలా ప్రత్యేకం. నా అభిమానులందరికీ అంకితం. నిరీక్షణ ముగిసింది. తుపాను మేల్కొంది. గర్వంగా, శక్తివంతంగా ‘వృషభ’ ఫస్ట్ లుక్‌ను ఆవిష్కరిస్తున్నాను. ఇది మీ ఆత్మను ఉత్తేజపరిచి, కాలంతో పాటు ప్రతిధ్వనించే కథ” అని సంతోషాన్ని వ్యక్తం చేశారు. తన పుట్టినరోజున ఈ లుక్‌ను విడుదల చేయడం మరింత సంతోషాన్నిచ్చిందని, అభిమానుల ప్రేమే తనకు గొప్ప బలమని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -