Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeసినిమామరోమారు రిలీజ్‌ వాయిదా

మరోమారు రిలీజ్‌ వాయిదా

- Advertisement -

పవన్‌కళ్యాణ్‌ నటించిన ‘హరి హర వీర మల్లు’ చిత్ర విడుదల గురించి జరుగుతున్న ప్రచారాలు, పెరుగుతున్న ఊహాగానాలు నేపథ్యంలో నిర్మాతలు శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేశారు. ‘అచంచలమైన ఓపిక, నమ్మకంతో ‘హరి హర వీరమల్లు’ సినిమాకు తోడుగా నిలిచిన అభిమానులు, శ్రేయోభిలాషులు, సినీ ప్రేమికులందరికీ హదయపూర్వక కతజ్ఞతలు. గతంలో ప్రకటించిన జూన్‌ 12వ తేదీకి చిత్రాన్ని మీ ముందుకు తీసుకు రావడానికి అవిశ్రాంత ప్రయత్నాలు చేస్తున్నాం. అయినప్పటికీ ఆ తేదీకి చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురాలేకపోతున్నామని తెలియజేస్తున్నాం. కష్టమైనప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. పవన్‌ కళ్యాణ్‌ నటించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని మరింత గొప్పగా మలచాలనేదే మా ప్రయత్నం. అందుకే మేము మరి కొంత సమయం తీసుకుంటున్నాం. మీ ఎదురు చూపులకు బహుమతిగా గొప్ప చిత్రాన్ని అందిస్తామని హామీ ఇస్తున్నాం. ఈ ఆలస్యం మన సహనాన్ని పరీక్షించవచ్చు. కానీ ఓ చరిత్రను సృష్టించే సినిమా ఇది అని కచ్చితంగా చెప్పగలం’ అని మేకర్స్‌ తెలిపారు. మెగా సూర్య ప్రొడక్షన్‌ పతాకంపై ఎ.ఎం.రత్నం చిత్ర సమర్పకులుగా, ఎ. దయాకర్‌రావు నిర్మాతగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏ.ఎం.జ్యోతికృష్ణ, క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad