హీరో నవీన్ పొలిశెట్టి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘అనగనగా ఒక రాజు’తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే చిత్ర బృందం విడుదల చేసిన మోషన్ పోస్టర్ అందరి దష్టిని ఆకర్షించింది. ఈ చిత్రంతో నవీన్ పొలిశెట్టి థియేటర్లలో నవ్వుల పండుగను తీసుకురాబోతున్నాడని మోషన్ పోస్టర్‌తోనే అర్థమైంది. తెలుగు సినీ అభిమానులు సంక్రాంతి పండుగను సినిమా పండుగలా భావిస్తుంటారు. ముఖ్యంగా సంక్రాంతి సమయంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్‌లకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ ఉంటుంది.
ఈ క్రమంలోనే పండుగకి సరైన సినిమాగా వచ్చే సంక్రాంతికి థియేటర్లలో ఈ సినిమా అడుగుపెట్టనుంది. ఇందులో నవీన్ పొలిశెట్టికి జోడిగా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఈ చిత్రంతో మారి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణ సంస్థలు కొన్నేళ్లుగా వరుస ఘన విజయాలను సొంతం చేసుకుంటున్నాయి. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ‘డాకు మహారాజ్’ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. 2026 సంక్రాంతికి ‘అనగనగ ఒక రాజు’తో మరో పండగ విజయాన్ని ఖాతాలో వేసుకోవడానికి సిద్ధమవుతున్నారు.
సంక్రాంతి కానుకగా విడుదల
- Advertisement -
- Advertisement -