– రూ.10 లక్షల కోట్లకు నికర విలువ
న్యూఢిల్లీ : ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండిస్టీస్ (ఆర్‌ఐఎల్) గ్లోబల్ టాప్ 25 విలువైన కంపెనీల్లో ఒక్కటిగా చేరింది. 118 బిలియన్ డాలర్ల నికర విలువ (రూ.10 లక్షల కోట్లు)తో మైక్రోసాఫ్ట్, అల్పాబెట్, సౌదీ ఆరామ్కో సరసన చేరింది. చమురు నుంచి టెలికాం రంగాల్లో రాణిస్తోన్న ఆర్‌ఐఎల్ అంతర్జాతీయంగా 21వ అత్యంత విలువైన కంపెనీగా నిలిచిందని బ్లూమ్‌బర్గ్ డాటా వెల్లడించింది. రిలయన్స్ మార్కెట్ కాపిటలైజేషన్ 140 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది టోటల్ ఎస్‌ఏ, బీపీ పీఎల్‌సీ కంటే ఎక్కువ. నిఫ్టీ 50లోని 19 కంపెనీల మార్కెట్ విలువతో సమానం. 2024-25 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4) ఫలితాలను రిలయన్స్ ఇండిస్టీస్ శుక్రవారం ప్రకటించింది. కంపెనీ లాభాలు 2.4 శాతం పెరిగి రూ.19,407 కోట్లకు చేరినట్లు తెలిపింది. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ.5.5 డివిడెండ్ ప్రకటించింది. మొత్తం ఆదాయం రూ. 2.4 లక్షల కోట్ల నుంచి రూ. 2.6 లక్షల కోట్లకు చేరింది. 2025 మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి ఆర్‌ఐఎల్ నికర లాభాలు రూ.69,648 కోట్లకు చేరింది. కంపెనీ నికర విలువ రూ.10 లక్షల కోట్లతో రికార్డు నెలకొల్పింది. గతేడాది ప్రపంచ వ్యాపారం సమస్యాత్మకంగా నిలిచిందని రిలయన్స్ ఇండిస్టీస్ చైర్మెన్ ముకేష్ అంబానీ అన్నారు. బలహీన ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో మెరుగైన పనితీరును కనబర్చినట్టు తెలిపారు.
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా అనంత్ అంబానీ
ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీని ఆర్‌ఐఎల్‌కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. మే 1 నుంచి ఇది అమల్లోకి రానుందని ఆకంపెనీ తెలిపింది. వచ్చే ఐదేండ్లపాటు అనంత్ ఈ హోదాలు కొనసాగను న్నారు. ప్రస్తుతం ఆయన నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు.
గ్లోబల్ టాప్ 25 క్లబ్‌లోకి రిలయన్స్
- Advertisement -
RELATED ARTICLES