Tuesday, September 2, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుహైకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట

హైకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. గతంలో నమోదైన కేసులో వ్యక్తిగత హాజరు నుంచి హైకోర్టు మినహాయింపు ఇచ్చింది. 2021 లో ఏఐసీసీ పీలుపు మేరకు పీసీసీ ఆధ్వర్యంలో రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంలో రేవంత్ రెడ్డిపై సైఫాబాద్ పీఎస్ లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. ఈ కేసు నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో పెండింగ్ లో ఉంది. ఈ కేసును కొట్టివేయాలని రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ప్రజాప్రతినిధుల కోర్టులో రేవంత్ రెడ్డికి హాజరు మినహాయింపు ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని పీపీ నాగేశ్వరరావును ఆదేశిస్తూ తదుపరి విచారణ వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేసింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad