నవతెలంగాణ-హైదరాబాద్: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఆ రాష్ట్ర హైకోర్టు ఊరట కల్పించింది. సీఎం సిద్ధరామయ్యపై బీజేపీ దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం కేసులో ట్రయల్ కోర్టు చర్యలపై స్టే విధించింది. దీంతో ఆయనకు మధ్యంతర ఉపశమనం లభించింది. ఈ ఫిర్యాదు 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన వార్తాపత్రిక ప్రకటనకు సంబంధించినది. అందులో తమ ప్రభుత్వాన్ని ’40 శాతం కమిషన్ సర్కార్’గా ముద్రవేసి పరువు తీసిందని బీజేపీ ఆరోపించింది. ఈ ఫిర్యాదులో సీఎం సిద్ధరామయ్యతో పాటు రాహుల్ గాంధీ, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ల పేర్లను కూడా చేర్చారు. ఈ కేసులో తాజాగా దిగువ కోర్టు ఉత్తర్వులను కర్ణాటక హైకోర్టు నిలిపేస్తూ ఆదేశాలిచ్చింది. దీనికి సంబంధించి జస్టిస్ ఎస్.ఆర్. కృష్ణ కుమార్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మేజిస్ట్రేట్ కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్న పరువు నష్టం కేసులో తదుపరి చర్యలను తాత్కాలికంగా నిలిపివేస్తుంది. ఇదే న్యాయమూర్తి గతంలో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ), ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లకు కూడా ఇలాంటి ఉపశమనం కల్పించారు. కాగా, 2023 ఎన్నికల సమయంలో పోలింగ్‌కి ఒకరోజు ముందు కాంగ్రెస్ వార్తాపత్రికలో యాడ్ వేయించింది. బీజేపీ ప్రభుత్వంలో పదవులు, కాంట్రాక్టులకు లంచం రేట్లు విధించిందని కాంగ్రెస్ విమర్శించింది. అయితే, ఇలాంటి ప్రకటన వల్ల తమ పార్టీ పరువు తీసిందంటూ బీజేపీ విరుచుకుపడింది.
సీఎం సిద్ధరామయ్యకు ఊరట..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES