Thursday, May 15, 2025
Homeఆటలుఐపిఎల్‌ ఫ్రాంచైజీలకు ఊరట

ఐపిఎల్‌ ఫ్రాంచైజీలకు ఊరట

- Advertisement -

– తిరిగి వస్తున్న విదేశీ ఆటగాళ్లు
– 25 తర్వాత వచ్చేయండి: దక్షిణాఫ్రికా బోర్డు షరతు
– తాత్కాలిక క్రికెటర్లను తీసుకోండి: బిసిసిఐ
ముంబయి:
భారత్‌-పాకిస్తాన్‌ దేశాల ఉద్రిక్తతల నేపథ్యంలో షెడ్యూల్‌ ప్రకారం జరగాల్సిన ఐపిఎల్‌ 10రోజులు పొడిగించబడింది. దీంతో ఆయా ఫ్రాంచైజీల తరఫున ఆడే విదేశీ ఆటగాళ్లలో చాలామంది తమ తమ దేశాలకు వెళ్లిపోయారు. డబ్ల్యుటిసి ఫైనల్‌కు చేరడంతో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఇప్పటికే తమ తమ దేశాలకు వెళ్లిపోగా.. ఈనెల 29నుంచి ఇంగ్లండ్‌-వెస్టిండీస్‌ జట్ల మధ్య వైట్‌బాల్‌ సిరీస్‌ ప్రారంభం కానుంది. దీంతో ఆ రెండు దేశాల ఆటగాళ్లు కూడా ఐపిఎల్‌కు దూరం కానున్నారు. ఈ క్రమంలో ప్లే ఆఫ్స్‌ రేసులో ఉన్న ఫ్రాంచైజీలు విదేశీ ఆటగాళ్లను వెనక్కి రప్పించుకుంటున్నాయి. దీంతో బట్లర్‌, అజ్మతుల్లా, మిచెల్‌ ఓవెన్‌(గుజరాత్‌ టైటాన్స్‌)తోపాటు అలాగే మిగిలిన ఫ్రాంచైజీల విదేశీ ఆటగాళ్లు కూడా భారత్‌కు తిరిగి పయనమౌతున్నారు.
తాజాగా దక్షిణాఫ్రికా ఆటగాళ్లకు ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌ల కంటే ముందే స్వదేశం రావాల్సిందిగా ఆ దేశ క్రికెట్‌బోర్డు షరుతు విధించింది. ‘మొదట అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం మే 25న ఐపిఎల్‌ ఫైనల్‌ జరగాల్సి ఉంది. కానీ, భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతల కారణంగా 10రోజుల పాటు టోర్నీ వాయిదా పడడంతో ఫైనల్‌ తేదీ జూన్‌ 3కి మారింది. అయితే, ముందస్తు ఒప్పందం ప్రకారం మే 25 వరకే మా ఆటగాళ్లు ఐపిఎల్‌ ఆడతారు. మే 26న స్వదేశం బయల్దేరుతారు. ఆ తర్వాత 30న డబ్ల్యుటిసి ఫైనల్‌ ఆడేందుకు లండన్‌ చేరుకుంటారు. ఇందులో ఏ మార్పు లేదు’ అని దక్షిణాఫ్రికా క్రికెట్‌, హెడ్‌ కోచ్‌ శుక్రి కొన్రాడ్‌ బుధవారం స్పష్టం చేశారు.
25తర్వాత వీరంతా వెనక్కి
2025 ఐపిఎల్‌లో 20మంది దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఆడుతున్నారు. వీరిలో 8మంది డబ్ల్యూటిసి ఫైనల్‌కు దక్షిణాఫ్రికా ప్రకటించిన జట్టులో ఎంపికయ్యారు. ‘ఆ ఎనిమిది మంది ఫిట్‌గా ఉండడం, మ్యాచ్‌కు కొన్ని రోజుల ముందు నుంచే అందుబాటులో ఉండడం చాలా ముఖ్యం. అందుకే ఆ దేశ క్రికెట్‌ బోర్డు తమ ఆటగాళ్లకు అల్టిమేటం జారీ చేసింది. మే 26 నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ స్క్వాడ్‌తో కలవాలని ఆదేశించింది. దీంతో కార్బిన్‌ బాస్చ్‌, రియాన్‌ రికెల్టన్‌ (ముంబయి ఇండియన్స్‌), వియాన్‌ మల్డర్‌(సన్‌రైజర్స్‌), మార్కో యాన్సెన్‌(పంజాబ్‌), ఎడెన్‌ మర్క్‌రమ్‌(లక్నో), లుంగి ఎన్గిడి(ఆర్సీబీ), కగిసో రబాడ(గుజరాత్‌), ట్రిస్టన్‌ స్టబ్స్‌(ఢిల్లీ క్యాపిటల్స్‌) తిరిగి బయల్దేరి లండన్‌కు వెళ్లనున్నారు.
తాత్కాలిక క్రికెటర్లను తీసుకోండి
బిసిసిఐఈ క్రమంలో అన్ని ఫ్రాంచైజీలకు బిసిసిఐ శుభవార్త చెప్పింది. ‘అందుబాటులో ఉన్న వాళ్లను తీసుకోండి’ అని బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. ఐపిఎల్‌ పున్ణప్రారంభ మ్యాచ్‌లకు కొందరు విదేశీ ఆటగాళ్లు దూరం కానున్నారు. వ్యక్తిగత కారణాలు, అనారోగ్యం లేదా గాయాలు వెంటాడడంతో వాళ్లు టోర్నీకి దూరమయ్యే అవకాశముంంది. ఈ పరిస్థితుల్లో తాత్కాలిక క్రికెటర్లను తీసుకోవాలని ఐపిఎల్‌ సిఇవో హేమంగ్‌ వెల్లడించారు. సవరించిన షెడ్యూల్‌ ప్రకారం మే 17 నుంచి జూన్‌ 3 వరకు జరగనుంది.
ఢిల్లీ జట్టులోకి బంగ్లా పేసర్‌ ఆస్ట్రేలియాకు చెందిన జేక్‌ ఫ్రేజర్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అతను వ్యక్తిగత కారణాలతో ఐపిఎల్‌ 2025 మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదు. దీంతో ఢిల్లీ అతడి స్థానంలో బంగ్లాదేశ్‌ పేసర్‌ ముస్తాఫిజుర్‌ రెహ్మన్‌ (రూ.6 కోట్లు) జట్టులోకి తీసుకుంది. ముస్తాఫిజుర్‌ ఇప్పటివరకు ఐపిఎల్‌లో 57 మ్యాచ్‌లు ఆడి 61 వికెట్లు పడగొట్టాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -