Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeఆటలుఆర్‌సీబీ ప్రతినిధికి ఊరట

ఆర్‌సీబీ ప్రతినిధికి ఊరట

- Advertisement -

– బెయిల్‌ మంజూరు చేసిన హైకోర్టు
బెంగళూర్‌: ఐపీఎల్‌18 చాంపియన్‌గా నిలిచిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ (ఆర్‌సీబీ) విజయోత్సవాల్లో చిన్నస్వామి స్టేడియంలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో పోలీసులు అరెస్టు చేసిన ఆర్‌సీబీ ప్రతినిధి సహా డిఎన్‌ఏ ఉద్యోగులకు కర్ణాటక హైకోర్టులో ఊరట లభించింది. ఎటువంటి ప్రాథమిక విచారణ, ఘటనకు బాధ్యత వహించే ఆధారాలు సేకరించకుండానే మౌఖిక ఆదేశాలతో అరెస్టు చేయటాన్ని జస్టిస్‌ ఎస్‌.ఆర్‌ కృష్ణ కుమార్‌ తప్పుపట్టారు. ఆర్‌సీబీ మార్కెటింగ్‌, రెవెన్యూ చీఫ్‌ నిఖిల్‌ సహా ఇతర ప్రతినిధులు సునీల్‌ మాథ్యూ, కిరణ్‌ కుమార్‌, శామంత్‌లకు ఏకసభ్య ధర్మాసనం బెయిల్‌ మంజూరు చేసింది. చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad