Friday, November 7, 2025
E-PAPER
Homeతాజా వార్తలుస్మితా సభర్వాల్‌కు హైకోర్టులో ఊరట

స్మితా సభర్వాల్‌కు హైకోర్టులో ఊరట

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: కాళేశ్వరం కేసులో ఐఏఎస్‌ స్మితా సభర్వాల్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే దాఖలైన పిటిషన్లతో కలిపి విచారిస్తామని పేర్కొంది. కాళేశ్వరం అంశంపై పీసీ ఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదికను ఇటీవల స్మితా సభర్వాల్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. నోటీసుల జారీ, వాంగ్మూలం నమోదు చేసిన విధానాన్ని సవాల్‌ చేసిన ఆమె.. ఆ నివేదికను కొట్టివేయాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. తనపై తదుపరి చర్యలు చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -