- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ నిర్బంధాన్ని రద్దు చేయనున్నట్లు కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆరు నెలల తర్వాత వాంగ్‌చుక్ జైలు నుంచి విడుదల కానున్నారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ప్రకటన చేసింది. లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ గతేడాది సెప్టెంబర్‌లో లేహ్ ప్రాంతంలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ అల్లర్లకు కారకుడిగా భావిస్తూ కేంద్రం ఆయనపై నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ పెట్టింది. దీంతో అప్పటి నుంచి జైలులో ఉంటున్నారు.
- Advertisement -



