Saturday, July 12, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంహెచ్‌సీఏ నిందితులనుకస్టడీకి ఇవ్వండి

హెచ్‌సీఏ నిందితులనుకస్టడీకి ఇవ్వండి

- Advertisement -

– నాంపల్లి కోర్టులో సీఐడీ పిటిషన్‌
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ)లో భారీ ఎత్తున నిధుల దుర్వినియోగానికి పాల్పడిన నిందితులు ఐదుగురిని పది రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. హెచ్‌సీఏలో భారీ ఎత్తున నిధుల దుర్వినియోగంతో పాటు పలు అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఈ సంస్థ అధ్యక్షుడు జగన్మోహన్‌రావు, కోశాధికారి శ్రీనివాస్‌, సీఈఓ అనిల్‌, శ్రీచక్ర క్రికెట్‌ క్లబ్‌ అధ్యక్షురాలు కవిత, ఈ సంస్థ కార్యదర్శి రాజేంద్రయాదవ్‌లను సీఐడీ అధికారులు గురువారం అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరిని తదుపరి విచారణ జరపటానికి పది రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని సీఐడీ.. కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. మరోవైపు, వీరికి బెయిల్‌ను మంజూరు చేయాలంటూ నిందితుల తరఫు న్యాయవాదులు న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేయనున్నారని సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -