Tuesday, April 29, 2025
Homeసినిమాపది కాలాల పాటు గుర్తుంటుంది

పది కాలాల పాటు గుర్తుంటుంది

‘శివలెంక కష్ణ ప్రసాద్‌తో నేను ఇది వరకు ‘సమ్మోహనం’, ‘జెంటిల్‌ మెన్‌’ చిత్రాలు చేశాను. ఇప్పుడు ‘సారంగపాణి జాతకం’ చేశాం. ఈ మూడు చిత్రాలు కూడా గొప్పవే. ప్రేక్షకులు పది కాలాల పాటు గుర్తు పెట్టుకునే సినిమాలు మా కాంబినేషన్‌లో రావడం చాలా ఆనందంగా ఉంది’ అని దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ అన్నారు.
ప్రియదర్శి, రూపా కొడవయూర్‌ జంటగా ఇంద్రగంటి మోహనకష్ణ, నిర్మాత శివలెంక కష్ణ ప్రసాద్‌ కాంబోలో వచ్చిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. శ్రీదేవీ మూవీస్‌ బ్యానర్‌ మీద నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై, ప్రేక్షకుల విశేష ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్‌ ‘ఫన్‌’టాస్టిక్‌ సక్సెస్‌ మీట్‌ నిర్వహించింది.
ఈ సందర్భంగా ఇంద్రగంటి మోహనకష్ణ మాట్లాడుతూ, ‘మా సినిమా మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ఫ్యామిలీస్‌ ఇప్పుడిప్పుడే థియేటర్లకు వస్తున్నారు. అచ్చమైన తెలుగు నటులు నటించిన తెలుగు సినిమాను అందించాం. ఇది నా కెరీర్‌లో స్పెషల్‌ మూవీ కానుంది’ అని అన్నారు.
‘సెలెబ్రిటీ షో వేశాం. ఆడియెన్స్‌, సెలెబ్రిటీలు అందరూ సినిమాను ఎంజారు చేశారు. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్‌. ‘కోర్ట్‌’ తరువాత మళ్లీ అందమైన ‘సారంగపాణి జాతకం’ ఓ వరంలా దొరికింది’ అని ప్రియదర్శి చెప్పారు. ‘ఇంద్రగంటి మంచి రచయిత, దర్శకులు. చాలా రోజుల తరువాత అందరూ పగలబడి నవ్వుకుంటున్నారు. దర్శి ఆల్‌ రౌండర్‌ నటుడు. రూపా అద్భుతంగా నటించారు. వెన్నెల కిషోర్‌ స్క్రీన్‌ మీద కనిపిస్తే చాలు థియేటర్లో అరుపులే. హర్ష నటన అంటే నాకు చాలా ఇష్టం. కష్ణ ప్రసాద్‌తో నా జర్నీ మర్చిపోలేనిది’ అని శ్రీనివాస్‌ అవసరాల తెలిపారు.
వెన్నెల కిషోర్‌ మాట్లాడుతూ, ‘సినిమా చూసిన వారంతా ఫోన్‌లు, మెసేజ్‌లు చేేస్తున్నారు. ఇంద్రగంటితో పని చేయడం ఆనందంగా ఉంది. దర్శికి మంచి జడ్జ్‌మెంట్‌ ఉంది. అప్పట్లో ఆమీర్‌ ఖాన్‌కి ఇలాంటి జడ్జ్‌ మెంట్‌ ఉండేది. ఇంద్రగంటి సినిమా అంటే కారెక్టర్‌ అడగకుండా చేసేయాలి.. దర్శి సినిమా అంటే డేట్స్‌ అడగకుండా ఇచ్చెయ్యాలి. శివలెంక సినిమా అంటే కళ్లు మూసుకుని చేసేయాలి’ అని అన్నారు.
మా సినిమాకు మంచి టాక్‌ వస్తోంది. ఫుట్‌ ఫాల్స్‌ కూడా పెరుగు తున్నాయి. ఈ సినిమాను థియేటర్లో ఎంజారు చేస్తేనే బాగుంటుంది. ఫ్రెండ్స్‌, ఫ్యామిలీతో కలిసి సినిమాను చూస్తే వచ్చే కిక్కు వేరేలా ఉంటుంది. పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు ముందుకు వచ్చి మా సినిమాను రిలీజ్‌ చేశాయి. ఈ చిత్రం మున్ముందు మరింత పెద్ద విజయాన్ని సాధిస్తుందని నమ్మకంగా ఉంది. ఇంద్రగంటితో ‘సమ్మోహనం, జెంటిల్‌ మెన్‌’ తీసి సక్సెస్‌ కొట్టాను. ఇప్పుడు హ్యాట్రిక్‌ హిట్‌గా ఈ సినిమా నిలవడం చాలా సంతోషంగా ఉంది.

– నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img