- Advertisement -
నవతెలంగాణ-భిక్కనూర్: పట్టణ కేంద్రంలోని శ్రీ రేణుకా మాత ఆలయ సమీపంలో ఉన్న కౌసల్య ఎంక్లేవ్ ఇటీవల కాలంలో నూతన వెంచర్ను ఏర్పాటు చేశారు. గ్రామపంచాయతీ కేటాయించిన 10% స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టి సొంతానికి వాడుకుంటున్నాడని ఆర్టిఐ జిల్లా ప్రతినిధి గంగల రవీందర్ ఫిర్యాదు మేరకు మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్, ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి మహేష్ గౌడ్ అక్రమ నిర్మాణాలను తొలగించి స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు.


- Advertisement -