- Advertisement -
- ఏన్సిఎఫ్ జిల్లా అధికారులు
నవతెలంగాణ-మద్నూర్: మద్నూర్ మండల కేంద్రంలోని సింగిల్ విండో ఆధ్వర్యంలో శనగ పంట కొనుగోళ్లులో భారీ మొత్తంలో క్వాలిటీ సర్వే అధికారుల అవినీతి, అక్రమాలపై మండల తాసిల్దార్‌కు, మార్కెట్ కమిటీ సెక్రటరీకి, వ్యవసాయ మండల అధికారులకు రైతులు ఫిర్యాదులు చేశారు. రైతుల ఫిర్యాదుపై ఎన్‌సిఎఫ్ జిల్లా అధికారులు శుక్రవారం మద్దూరు మండల కేంద్రాన్ని సందర్శించి విచారణ చేపట్టగా… క్వాలిటీ సర్వేర్ల అవినీతి అక్రమాలు బయటపడ్డాయి. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న క్వాలిటీ సర్వేలను వెంటనే తొలగిస్తున్నట్లు జిల్లా అధికారులు ప్రకటించారు.
ఇక్కడ కొనుగోలు జరిగే కేంద్రంలో ఎలాంటి అవినీతి అక్రమాలకు తావు లేకుండా రైతులు ఎవరికి ఒక్క రూపాయి ఇవ్వకుండా పారదర్శకంగా అమ్ముకోవాలని సూచించారు. అవినీతి అక్రమాలు జరగకుండా మార్కెట్ కమిటీ కార్యదర్శి అలాగే సింగిల్ విండో కార్యదర్శి ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలని జిల్లా ఎన్సిఎఫ్ అధికారులు వారికి ఆదేశాలు ఇచ్చారు.
రైతులు శనగ పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి అమ్ముకోవాలని, ప్రతి ఒక్క రైతు మద్దతు ధరను సద్వినియోగం సూచించారు. ఈ విలేకరుల సమావేశంలో ఎన్సీఎఫ్ జిల్లా అధికారులతో పాటు మార్కెట్ కమిటీ అధికారులు సింగిల్ విండో అధికారులు పాల్గొన్నారు
- Advertisement -



