- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: టాలీవుడ్ డైరెక్టర్ ఎన్.శంకర్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి సక్కుబాయమ్మ వృద్ధాప్య సంబంధింత సమస్యలతో ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. 1997లో ‘ఎన్‌కౌంటర్’ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయమైన శంకర్.. శ్రీరాములయ్య, భద్రాచలం, జయం మనదేరా, ఆయుధం, జై బోలో తెలంగాణ వంటి హిట్ సినిమాలను తెరకెక్కించారు. శంకర్ స్వగ్రామం నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలం చిరుమర్తి.
- Advertisement -



