Sunday, October 19, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ఎమ్మెల్యే చొరవతో ఎడ్ బిడ్ రోడ్డుకు మరమ్మత్తులు

ఎమ్మెల్యే చొరవతో ఎడ్ బిడ్ రోడ్డుకు మరమ్మత్తులు

- Advertisement -

నవతెలంగాణ -ముధోల్ 
మండలంలోని తరోడ గ్రామం నుండి ఎడ్ బిడ్ వరకు ఉన్న రోడ్డు గుంతల మాయంగా మారింది. దీంతో వాహన దారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ చొరవ తో ఎట్టకేలకు రోడ్డు మరమ్మతులకు నోచుకుంది. అడుగడుగునా గుంతలు పడ్డ రోడ్డుపై ప్రయాణంకు,ఇబ్బందులు ఎదురవడంతో కొన్ని రోజులనుండి  ఆర్టీసీ బస్సు కూడా ఆర్టీసీ వారు నడపడం లేదు. దీంతో చించాల,వెంకట పూర్,ఎడ్ బిడ్, ఎడ్ బిడ్ తండా ,చింత కుంట తండా గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయా గ్రామ ప్రజల  విన్నపం మేరకు ఎమ్మెల్యే గుంతలు పడ్డ రహదారి ని  తాత్కాలికంగా మరమ్మత్తులకు చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే  సూచన మేరకు శుక్రవారం ఎడ్ బిడ్ బీజేపీ నాయకులు నిమ్మపోతన్న ,దత్తాత్రి, భూమన్న, రాంచందర్ రెడ్డి లు  గుంతలను పూడ్చే కార్యక్రమాన్ని చేపట్టారు. గుంతలో మొరం ను వేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కు ఆయా గ్రామాల ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -