Monday, October 27, 2025
E-PAPER
Homeజిల్లాలుఅధిక ఫీజులను నియంత్రించాలని అడిషనల్ కలెక్టర్ కు వినతి

అధిక ఫీజులను నియంత్రించాలని అడిషనల్ కలెక్టర్ కు వినతి

- Advertisement -

నవతెలంగాణ-వనపర్తి 
జిల్లాలోని ప్రయివేట్ విద్యా సంస్థలలో అధిక ఫీజులను నియంత్రించాలని జాతీయ మాలల ఐక్యవేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు మాదారి భోజరాజు జిల్లా అడిషనల్ కలెక్టర్ యాదయ్య కు సోమవారం వినతి అందజేశారు. సామాన్య మధ్య తరగతి పేదలు అధిక ఫీజుల ఒత్తిడికీ లోన్ అవుతున్నారని, అధిక ఫీజులను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.  అలాగే 25 శాతం ఉచిత విద్యను ప్రయివేట్ యాజమాన్యాలు అమలు చేయడం లేదన్నారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో ఉపాధ్యక్షులు మద్దెల కర్ణాకర్ కార్యవర్గ సభ్యులు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -