నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్
జిల్లాలో మున్సిపల్, జడ్పిటిసి, ఎంపిటిసి ఎలక్షన్ల ఉన్నందున పోలీస్ పికెట్ల ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ ఆకాంక్ష యాదవ్ ను కోరారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘం నాయకులు రాచకొండ కమిషనరేట్ నుండి యాదాద్రి జిల్లాకు ఎస్పీ హోదా వచ్చిన సందర్భంగా జిల్లా ఎస్పీ కి సన్మానించారు. అనంతరం బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్, సామాజికవేత్త బట్టు రామచంద్రయ్య లు మాట్లాడుతూ భువనగిరి జిల్లాలో మున్సిపల్, జడ్పిటిసి, ఎంపిటిసి ఎలక్షన్లు జరగనున్నాయి. ఈ ఎలక్షన్లు శాంతియుతంగా, న్యాయంగా జరిగేలా చేయడానికి మీ పోలీస్ శక్తి అవసరం అని, మున్సిపల్ కేంద్రంలో గ్రామాలలో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసి శాంతియుతంగా ప్రజాస్వామ్యంగా ఎలక్షన్లు జరపాలని కోరారు. పోలీస్ పికెట్ల ఏర్పాటు, భువనగిరి జిల్లా పరిధిలోని మున్సిపల్, జడ్పిటిసి, ఎంపిటిసి ఎలక్షన్ సంబంధిత ప్రాంతాలలో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయాలి. ఇవి 24 గంటల పాటు పనిచేసేలా చూడాలి. ప్రజల భయాందోళన నివారణకై: గ్రామాలలో ప్రజలు భయం లేకుండా, సజావుగా ఎలక్షన్లలో పాల్గొనేలా ప్యాట్రోలింగ్ పెంచి అన్ని చర్యలు తీసుకోవాలి. కుల, రాజకీయ ఆధిపత్య నియంత్రణ: గ్రామాలు, మున్సిపల్ ప్రాంతాలలో కుల, రాజకీయ ఆధిపత్యాలు ఎక్కువగా ఉన్నందున, వాటిని నియంత్రించి ఆధిపత్య రాజకీయాలకు గట్టి అడ్డుకట్ట వేయాలి. ప్రజలు తమ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని అవరోధాలను తొలగించి, పూర్తి రక్షణ కల్పించాలి. ప్రజాసేవపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరు ఎలక్షన్ లో పాల్గొనే విధంగా ధైర్యంని కల్పించాలి నామినేషన్ వెయ్యకుండా కిడ్నాప్లు చేస్తామని బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మందు, డబ్బు పంపిణీ నివారణ: ఎలక్షన్ల సమయంలో ఓట్ల కోసం మందు, డబ్బు పంచే చర్యలకు గట్టి అడ్డుకట్ట వేయాలి. సమాచారం తెలిసిన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అగ్రవర్ణ పేదలపై దాడులు జరగకుండ అడ్డుకోవాలని జిల్లా ఎస్పీ ని కోరిన్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్, సామాజికవేత్త బట్టు రామచంద్రయ్య, బీసీ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గుండబోయిన సురేష్, బీసీ యువజన సంఘం ఉమ్మడిజిల్లా కన్వీనర్ ఎడ్ల మహాలింగం, అనిల్ లు పాల్గొన్నారు.
పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ ఆకాంక్ష యాదవ్ కి వినతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



