Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్మటన్ మార్కెట్ తరలించాలని వినతి

మటన్ మార్కెట్ తరలించాలని వినతి

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి : మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదురుగా ఉన్న మటన్ మార్కెట్ ను అక్కడ నుండి తరలించాలని కోరుతూ ఎస్సీ కాలనీవాసులు, గ్రామస్తులు శనివారం గ్రామ పంచాయితీ కార్యదర్శి గంగాజమునకు వినతి పత్రం అందజేశారు. జనావసాలకు సమీపంలో మటన్ మార్కెట్ ఉండడం మూలంగా ఈగలు, దోమలు వృద్ధి చెంది తమ పిల్లలు అంటూ వ్యాధుల బారిన పడుతున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. మటన్ మార్కెట్ లో వ్యాపారులు ఇష్ట రాజ్యాంగ వ్యవహరిస్తున్నారని తెలిపారు. మార్కెట్ వద్ద కోసే మేకలకు సంబంధించిన మేకల తోలు, బొక్కలు, రక్తం తదితర వాటిని మార్కెట్లోనే వదిలి వెళ్తున్నారని, వాటికోసం కుక్కలు వస్తున్నాయని వినతి పత్రంలో పేర్కొన్నారు.

ఆ దారి గుండా వెళ్లే చిన్నారులపై, పెద్దలపై కుక్కలు దాడులు చేసి గాయపరుస్తున్నాయన్నారు. అపరిశుభ్ర వాతావరణం మూలంగా దోమలు, ఈగలు తయారయ్యి కాలనీవాసులు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి విష జ్వరాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దారి గుండా పాఠశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు జంకుతున్నారని, మటన్ మార్కెట్ సమీపంలో ఉన్న గ్రంథాలయానికి పాఠకులు వెళ్లేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రధానమైన ఈ దారిలో మటన్ మార్కెట్ ఉండడం మూలంగా ఈ దారి గుండా వివిధ పనుల నిమిత్తం వెళ్లేందుకు కాలనీవాసులు, గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారుని తెలిపారు.

గ్రంథాలయానికి వచ్చే పాఠకులకు మటన్ మార్కెట్ నుండి వచ్చే దుర్వాసన వల్ల గ్రంథాలయానికి వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదన్నారు. ఎస్సీ కాలనీవాసుల, గ్రామ ప్రజల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని మటన్ మార్కెట్ ను తరలించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కాలనీ వాసులు మైలారం సుధాకర్, కొంటి కంటి నరేందర్, పాలెపు చిన్న గంగారం, గాండ్ల శ్రీనివాస్, బాలయ్య, కృష్ణమూర్తి, పోచయ్య, గంగాధర్, అనిల్ కుమార్, సురేష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad