Tuesday, September 16, 2025
E-PAPER
Homeఆదిలాబాద్జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని వినతి..

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని వినతి..

- Advertisement -

నవతెలంగాణ -ముధోల్  : అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల మంజూరు చేయాలని జర్నలిస్టు యూనియన్ టీయూడబ్ల్యూజే (ఐజేయు)ముధోల్ శాఖ ఆధ్వర్యంలో తహశీల్దార్ శ్రీలత కు సోమవారం వినతిపత్రంఅందజేశారు.ప్రజలసమస్యలు,సామాజిక అంశాలు, ప్రభుత్వ పథకాలను సమాజానికిచేరవేయడంలో పాత్రికేయులు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. పల్లెల నుండి పట్టణాల వరకు 24 గంటలూ శ్రమిస్తూ ప్రజాసేవలో అహర్నిశలు కృషి చేస్తున్నప్పటికీ,  ఇళ్ల స్థలాల విషయములో ప్రభుత్వ సహకారం అందించడం లేదన్నారు.ప్రభుత్వం వెంటనే స్పందించి జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలను  కేటాయించాలని కోరారు . ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు షఫీ ఉల్లాఖాన్, పీసర శ్రీనివాస్ గౌడ్, పోతాజీ ,లోలం భూమన్న, రాహుల్ ,సునీల్ ,రాజేశ్వర్ ,నాగేష్,గంగారెడ్డి, ఖాలిక్, చంద్రమణి,శరత్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -