నవతెలంగాణ-కమ్మర్ పల్లి
చౌటుపల్లి హనుమంత్ రెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా మోర్తాడ్ పంప్ హౌస్ లో ట్రాన్స్ ఫార్మర్ రిపేర్ త్వరగా అయ్యేలా చూడాలని బషీరాబాద్ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి విన్నవించారు. మేరకు మంగళవారం సర్పంచ్ బైకాన్ మున మహేశ్ ఆధ్వర్యంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు వేల్పూర్ లోని స్వగృహంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని కలిశారు. బషీరాబాద్ కాడి చెరువుకు చౌట్ పల్లి హనుమంత్ రెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నీటిని అందించే మోర్తాడ్ పంప్ హౌస్ లో ట్రాన్స్ ఫార్మర్ రిపేర్ లో ఉందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ట్రాన్స్ ఫార్మర్ మరమ్మత్తులు త్వరగా అయ్యేలా చూడాలని కోరారు.
వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, చీఫ్ ఇంజనీర్ తో ఫోన్లో మాట్లాడి పంపు హౌస్ లో రిపేర్ త్వరగా అయ్యేటట్టు అధికారులకు ఆదేశించి, నీటిని త్వరగా విడుదల చేయాలని కోరారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ని కలిసిన వారిలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు తోపరం శివ నందు, ఉప సర్పంచ్ చిలువేరి భూమేశ్వర్, వార్డు సభ్యులు బందేల రాజు, బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఏనుగు గంగా రెడ్డి, మండల నాయకులు నర్రా మోహన్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు నర్సయ్య, నాయకులు గుండబోయిన రాజు, ఆకుల లింగన్న, రాములు, సుదర్శన్, తదితరులు ఉన్నారు.



