- Advertisement -
నవతెలంగాణ-భిక్కనూర్ : రేషన్ డీలర్ల సమస్య పరిష్కరించాలని సోమవారం పట్టణ కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో మండల రేషన్ డీలర్లు తాసిల్దార్ సునీతకు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ 5 నెలల నుండి రేషన్ డీలర్ల కమిషన్ రావడంలేదని త్వరగా కమిషన్ అందజేసి గౌరవ వేతనం 5వేలు, క్వింటాల్ కు 300 కమిషన్ అందజేయాలన్నారు. సెంట్రల్, స్టేట్ కమిషన్ వేరువేరుగా కాకుండా ఒకేసారి ఇవ్వాలని వినతి పత్రంలో పేర్కొన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల రేషన్ డీలర్లు పాల్గొన్నారు.
- Advertisement -