Wednesday, March 18, 2026
E-PAPER
Homeనల్లగొండపిఓటి చట్టాన్ని రద్దు చేయాల‌ని కలెక్టర్‌కు విన‌తి

పిఓటి చట్టాన్ని రద్దు చేయాల‌ని కలెక్టర్‌కు విన‌తి

- Advertisement -
  • మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి

నవతెలంగాణ-ఆలేరు టౌన్‌: ఆలేరు మండల పరిధిలో ఉన్న సుమారు 1600ల పేద ప్రజల ఇళ్ల స్థలాలను, భూములను 22-ఎ యాక్టు-1908, పిఓటి యాక్ట్-1977 పేరుతో ప్రోహిబిటెడ్ జాబితాలో చేర్చగా, పిఓటి చట్టాన్ని రద్దు చేసి, భూములను రెగ్యులర్ చేయాలని కోరుతూ.. బుధవారం ఆలేరు మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, ఆలేరు మున్సిపల్ కౌన్సిలర్లు పాకాల మౌనిక, యాట శివ, బీజన కళ్యాణి లతో కలిసి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతికి వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆలేరు పట్టణ బిఆర్‌ఎస్ అధ్యక్షులు పుట్ట మల్లేష్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, మాజీ మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ గ్యాదపక నాగరాజు, మాజీ ఎంపిటిసి రాం నర్సయ్య, పాకాల హరీశ్, బీజని మధు, ఎండీ ఫయాజ్, శ్రీకాంత్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -