- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : నాంపల్లి ఫర్నీచర్ షాపులో చిక్కుకున్న ఆరుగురిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. గత 18 గంటలుగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తూ సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రాణాలకు తెగించి మంటలు, పొగ మధ్యలోకి వెళ్లి బాధితులను వెలికితీయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా భవనం దృఢత్వంపై అధికారులకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరిస్థితిని బట్టి తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
- Advertisement -



