Tuesday, December 23, 2025
E-PAPER
Homeహైదరాబాద్‘మొహర్రం’పై పరిశోధన పత్రం..డా.మహమ్మద్ షరీఫ్‌కి అభినందనలు

‘మొహర్రం’పై పరిశోధన పత్రం..డా.మహమ్మద్ షరీఫ్‌కి అభినందనలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: తెలంగాణలో మొహర్రం పండుగ చారిత్రక ప్రాధాన్యతపై మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ చరిత్ర అధ్యాపకులు డా.మహమ్మద్ షరీఫ్ పరిశోధన పత్రాన్ని సమర్పించి విశేష ప్రశంసలు అందుకున్నారు.

“Muharram Festival in Telangana: A Historical Perspective” అనే అంశంపై డా. మహమ్మద్ షరీఫ్ తమ పరిశోధనా పత్రాన్ని 44వ వార్షిక సమావేశం సందర్భంగా సౌత్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ (SIHC) ఆధ్వర్యంలో తమిళనాడు రాష్ట్రం విట్ వెల్లూరులో సమర్పించారు. ఈ పరిశోధన పత్రం తెలంగాణ ప్రాంతంలోని మొహర్రం పండుగ సామాజిక, సాంస్కృతిక మరియు చారిత్రక విశిష్టతను విశ్లేషిస్తూ శాస్త్రీయంగా రూపొందించబడినదిగా సభలోని చరిత్రవేత్తల నుండి మంచి స్పందన పొందింది.

ఈ సందర్భంగా SIHC అధ్యక్షులు ప్రొఫెసర్ కె. అర్జున్‌ రావు డా. మహమ్మద్ షరీఫ్‌ను అభినందిస్తూ, వారి పరిశోధన తెలంగాణ చరిత్ర అధ్యయనానికి విలువైన దోహదం చేస్తుందని ప్రశంసించారు. అలాగే మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం (ఎంజీయూ), నల్గొండకు చెందిన అధ్యాపకులు, మిత్రులు డా. మహమ్మద్ షరీఫ్‌కు అభినందనలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -