Wednesday, May 7, 2025
Homeజాతీయంరిజర్వేషన్‌ రైలుబోగీ లాంటిది..

రిజర్వేషన్‌ రైలుబోగీ లాంటిది..

- Advertisement -

– కంపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించాక.. ఇతరులను లోపలికి రానివ్వరు : సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ:
రిజర్వేషన్లను ఉద్దేశించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలోని కుల ఆధారిత రిజర్వేషన్లు రైలు బోగీల్లాంటివని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఆ కంపార్ట్‌మెంట్‌ లోకి ప్రవేశించిన వ్యక్తులు ఇతరులను లోపలికి రానివ్వరని పేర్కొంది. మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో ఓబీసీ రిజర్వేషన్లపై వేసిన పిటిషన్‌ విచారణలో భాగంగా సుప్రీం న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ ఈవిధంగా స్పందించారు. మహారాష్ట్రలో 2016-17లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఓబీసీ కోటా విషయంలో జరుగుతోన్న న్యాయపోరాటంలో ఎన్నికల నిర్వహణలో జాప్యం చోటుచేసుకుంటోంది. ఓబీసీలకు 27 శాతం కోటాను అమలుచేయడం కోసం మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్‌ను 2021లో సుప్రీంకోర్టు కొట్టివేసింది. కాగా.. ఓబీసీలకు సంబంధించిన డేటా ఉన్నప్పటికీ, దానిని ప్రభుత్వం ఉపయో గించడం లేదని తాజాగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన అధికారుల ద్వారా స్థానిక సంస్థలను ఏకపక్షంగా నడుపుతోందని ఆరోపించారు. రిజర్వేషన్ల ప్రయోజనాన్ని పొందేందుకు ఓబీసీ లలోనే వెనకబడిన వారిని గుర్తించాలని మరో న్యాయవాది తన వాదనను వినిపిం చారు. ఈ క్రమంలోనే న్యాయమూర్తి స్పందించారు. ”దేశంలో రిజర్వేషన్లు రైలు కంపార్ట్‌మెంట్ల మాదిరిగా మారాయి. అందులోకి ప్రవేశించిన వ్యక్తులు ఇతరులను లోపలికి రానివ్వరు. అయితే ప్రభుత్వాలు మరిన్ని వెనకబడిన తరగతులను గుర్తిం చాలి. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన వ్యక్తులు ఉన్నారు. వారు రిజర్వేషన్‌ ప్రయోజనం ఎందుకు పొందకూడదు..? కొన్ని కుటుం బాలు, సమూహాలు మాత్రమే ప్రయోజనం పొందుతున్నాయి” అని ఆయన అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -