నవతెలంగాణ-రాజన్నసిరిసిల్ల:
రాజస్థాన్ – జైసల్మేర్ నుండి లాంగెవాలా వరకు నిర్వహించిన ది బోర్డర్ రన్ 2025” 100 కిలోమీటర్ల అంతర్జాతీయ ప్రమాణాల అల్ట్రా మారథాన్ రన్‌లో రాజన్న సిరిసిల్లకు చెందిన ఆర్ముడ్ రిజర్వ్ కానిస్టేబుల్ అనిల్ యాదవ్ పాల్గొన్నారు.అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఎడారి ప్రాంతంలోని వేడి–చలి తీవ్రత, ఎత్తైన ఇసుక టేకులు వంటి సవాళ్ల మద్య 100 కిలోమీటర్ల పొడవున సాగిన ఈ రన్‌లో పాల్గొని 14 గంటల్లో పూర్తి చేసి కానిస్టేబుల్ అనిల్ యాదవ్ అపారమైన ధైర్యసాహసాలు, శారీరక–మానసిక దృఢతను ప్రదర్శించారు. ప్రజాసేవలో ఉంటూనే ఇటువంటి అల్ట్రా మారథాన్ ఈవెంట్లలో పాల్గొనడం ద్వారా ఫోర్స్‌లోని యువ సిబ్బందికి ఆదర్శంగా నిలిచిన అనిల్ కు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే,అధికారులు అభినందించారు. భవిష్యత్తులో ఇటువంటి పోటీలలో ప్రావీణ్యం సంపాదించి జిల్లా,రాష్ట్ర, దేశ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు.
మారథాన్ రన్ లో ఆర్మ్ డు రిజర్వ్ కానిస్టేబుల్
- Advertisement -
- Advertisement -



