Monday, January 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మోడీ సర్కార్ కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించండి

మోడీ సర్కార్ కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించండి

- Advertisement -
  • రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. చుక్కయ్య

నవతెలంగాణ-పరకాల: మోడీ సర్కార్ కార్మిక రైతు వ్యవసాయ కూలీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘడించాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం చుక్కయ్య ప్రజలకు పిలుపునిచ్చారు.సోమ‌వారం సీఐటీయు వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా జీపు జాత పరకాల పట్టణానికి వచ్చిన సందర్భంగా.. మాదారం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..మోడీ 11 ఏళ్ల పాలన లో కార్మికులకు కర్షకులకు వ్యవసాయ కూలీలకు నష్టం చేసే చర్యలు చేపడుతున్నాడని ఆయన వివరించారు. కార్మికులు ఏళ్ల తరబడి పోరాడి సాధించుకున్న 29 చట్టాలను నాలుగు కోడ్లు గా మార్చి యజమానులకు కార్మికులను బానిసలు చేస్తూ పెట్టుబడిదారులకు దేశ సంపదను దోషీ పెడుతున్నాడని ఆయన మండిపడ్డారు.

వామపక్షాలు పోరాడిన ఫలితంగా 2005లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి గ్యారెంటీ చట్టం వచ్చింది. ఈ చట్టాని నీరు కాల్చడం కోసం విబి జి రామ్ జి పథకాన్ని తీసుకొచ్చారని, దీంతో కూలీలకు ఉపాధి కరువుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సంస్కరణ బిల్లుతో ప్రజలకు రైతులకు ఇచ్చే సబ్సిడీ ఎగిరిపోతుందని విద్యుత్ ఖరీదు అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కార్మికులకు రైతులకు వ్యవసాయ కూలీలకు ప్రజలకు కష్టం చేస్తూ ఆదానీ అంబానీలకు వేల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తున్నారని ఆయన దయబెట్టారు. ఈ విధానాలను వెనక్కి తీసుకునేంతవరకు ప్రజలంతా ప్రతిఘటించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మడి రాజుల రాములు సిఐటియు జిల్లా కోశాధికారి బొట్ల చక్రపాణి నాయకులు బొచ్చు ఆదాం రమేష్ సాంబయ్య కమల్ మోహన్ రాజమల్లు కృష్ణంరాజు మడికొండ వినోద్ తో పాటు 100 మంది కార్మికులు ఘన స్వాగతం పలికారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -