- Advertisement -
- ట్యాంకర్ శుభ్రం చేసిన జీపీ సిబ్బంది
 
నవ తెలంగాణ మల్హర్ రావు 
మండలంలోని పెద్దతూండ్ల గ్రామపరిదిలోని నారాయణపల్లి,ఎస్సికాలనికి సరఫరా అయ్యే వాటర్ ట్యాంకర్ ద్వారా ఇంటింటికి మురికి నీరు సరఫరా అవుతుందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ,,అపరిశుభ్రతతో తాగునీరు,, అనే కథనం నవ తెలంగాణ దినపత్రిక వరంగల్ ఎడిసిన్ మంగళవారం ప్రచురించిన విషయం విదితమే.ఈ కథనానికి సంబంధించిన అధికారులు స్పందించి మంగళవారం వాటర్ ట్యాoకర్ ను జీపీ సిబ్బందితో బ్లీచింగ్ పౌడర్ వేసి శుభ్రం చేశారు.ఇందుకు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
- Advertisement -

                                    

