నవతెలంగాణ కథనానికి స్పందన..

– స్పందించిన మిషన్ భగీరథ అధికారులు
– భూపతిపూర్ లో పునరుద్ధరించిన మంచినీటి సౌకర్యం
నవతెలంగాణ – తాడ్వాయి
మండలంలోని గంగారం గ్రామపంచాయతీ పరిధిలో గల భూపతిపూర్ గ్రామంలో ఆదివాసీలు ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యపై ఆదివారం నవతెలంగాణ దినపత్రికలో ”భూపతిపూర్ లో తాగునీటి కష్టాలు”, మరమ్మత్తులకు నోచుకోని చేతిపంపులు, తాగునీటికి తల్లాడుతున్న ఆదివాసీలు, అనే శీర్షిక వచ్చిన కథనానికి వెంటనే తెల్లారే సోమవారం మిషన్ భగీరథ అధికారులు స్పందించారు. మిషన్ భగీరథ ఏఈ రామ్ చరణ్ ఆధ్వర్యంలో మిషన్ భగీరథ బృందం సోమవారం భూపతిపూర్ గ్రామాన్ని సందర్శించి తాగునీటి సౌకర్యాల గురించి పరిశీలించారు. మిషన్ భగీరథ నీటిని రెండు ట్యాంకులకు(ఎక్కించారు) సరఫరా చేశారు. నల్లల ద్వారా నీరు సరఫరా అవుతుంది. కాకుండా రెండు చేతిపంపులను కూడా పరమతులు చేశారు. దీంతో భూపతిపూర్ ఆదివాసి గ్రామంలో మంచినీటి సమస్య పరిష్కారమయింది. ఈ సందర్భంగా మిషన్ భగీరథ ఏఈ రాంచరణ్ మాట్లాడుతూ అనివార్య కారణాల వలన చిన్నబోయిన పల్లి లో సమస్య ఉండడం వల్ల నీరు సరఫరా ఆగిందని, ఇప్పటినుండి త్రాగునీటి ఇబ్బందులు లేకుండా అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేశామన్నారు. ఇప్పటినుండి తాగునీటి సమస్య ఉండదని పేర్కొన్నారు. నవ తెలంగాణలో వార్త స్పందనకు నీటి సమస్య పరిష్కారమైనందుకు భూపతిపూర్ ఆదివాసి గిరిజనులు నవతెలంగాణ పత్రికకు అభినందనలు తెలిపారు.

Spread the love