Saturday, June 7, 2025
E-PAPER
HomeNewsఅమ్మ మాట.. అంగన్వాడీ బాటకు స్పందన 

అమ్మ మాట.. అంగన్వాడీ బాటకు స్పందన 

- Advertisement -

నవతెలంగాణ – నసురుల్లాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమ్మ మాట అంగన్వాడి బడిబాటకు మంచి స్పందన వస్తుందని ఐసిడిఎస్ సూపర్వైజర్ వాణి తెలిపారు. శుక్రవారం నసురుల్లాబాద్ మండలంలోని కాంశెట్ పల్లి, నసురుల్లాబాద్ గ్రామంలో మూడు నుండి ఆరు సంవత్సరాల వయస్సు గల పిల్లలను అంగన్వాడి పాఠశాలల్లో చేర్పించలని పిల్లల తల్లిదండ్రులకు అంగన్వాడి టీచర్లు అవగాహన కల్పించడం జరిగింది. అదే విధంగా ఆ వయసు పిల్లలను అంగన్వాడిలో చేర్పించడం వలన పిల్లల్లో మొదలయ్యే ఎదుగుదల గురించి అంగన్వాడీ టీచర్లు క్షుణ్ణంగా తల్లిదండ్రులకు వివరించారు. మూడు నుండి ఆరు సంవత్సరాల పిల్లలను అంగన్వాడీలో చేర్పించడం వలన పిల్లల్లో మానసిక ఉల్లాసం మరింతగా పెరుగుతుందని వారు తెలియజేశారు. పిల్లల పెరుగుతున్న వయసును గుర్తుంచుకొని వారికి ప్రాథమిక పాఠశాల పై అవగాహన కలిగే విధంగా అంగన్వాడి పాఠశాలలో మాత్రమే నేర్పడం జరుగుతుందని వారు తెలియజేశారు. పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ అమ్మ మాట అంగన్వాడి బడిబాట అంటూ వారు గ్రామమంతా ర్యాలీ నిర్వహించారు. 

 పిల్లల తల్లిదండ్రులు వినియోహించుకోవాలని తెలియచేసారు. అమ్మ మాట అంగన్వాడీ బడి బాట కార్యక్రమములో  మండల ఐకెపి అధ్యక్షురాలు శోభ, అంగన్వాడీ టీచర్లు గౌరీ గంగమని ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -