- Advertisement -
విద్యుత్ తీగలను పరిశీలించిన ఏఈ
వినియోగదారులు సహకరిస్తే సరిచేస్తామని సూచన 
నవతెలంగాణ – బెజ్జంకి : మండల కేంద్రంలో గృహ వినియోగదారులకు విద్యుత్ సరఫరా తీగలు ప్రమాదకరంగా మారి ఆదర్శ విద్యాలయ విద్యార్థులకు ఆర్టీసీ బస్ సేవలు నిలిచిపోవడంతో నవతెలంగాణ దినపత్రిక ‘ప్రమాదకరంగా విద్యుత్ తీగలు’ శీర్షికతో మంగళవారం వార్తను ప్రచురించింది. బెజ్జంకి సర్కిల్ ఏఈ మహేశ్ వార్తకు స్పందించి ప్రమాదకరంగా మారిన విద్యుత్ తీగలను క్షేత్ర స్థాయిలో సందర్శించి పరిశీలించారు. గృహ వినియోగదారులు సహకరిస్తే విద్యుత్ తీగలను సరిచేస్తామని ఏఈ సూచించారు.
- Advertisement -

                                    

