– విలేకరుల సమావేశంలో సీఐపీ శ్రీను
– సమాజ శ్రేయస్సుకు పాటుపడాలని సూచన
నవతెలంగాణ-బెజ్జంకి
ఠాణాలోని సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుపై సోమవారం నవతెలంగాణ దినపత్రిక ‘అండదండలు..అభాసుపాలు’శీర్షికతో కథనాన్ని ప్రచురించింది. నవతెలంగాణ కథనానికి సిద్దిపేట రూరల్ సీఐపీ శ్రీను స్పందించి మండల కేంద్రంలోని ఠాణాను సందర్శించారు. సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుపై ఆరా తీశారు.ఈ సందర్భంగా ఠాణాలో సీఐపీ శ్రీను ఏఎస్ఐ శంకర్ రావుతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి మండలంలో నెలకొన్న అక్రమాలు, సమస్యల వివరాలడిగి తెలుసుకున్నారు. మండలంలోని అక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించి.. పోలీస్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు శాయశక్తుల కృషి చేస్తామని వెల్లడించారు. అక్రమ ఇసుక రవాణ, వడ్డీ వ్యాపారం,ట్రీబుల్ రైడింగ్, ఆన్ లైన్ గేమీంగ్ వంటి వాటిపై సమన్వయంతో ఉక్కుపాదం మోపి అరికట్టేల ప్రణాళిక రూపొందిస్తామన్నారు. మండలంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. సమాజం శ్రేయస్సుకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులై పాటుపడాలని సూచించారు.
నవతెలంగాణ కథనానికి స్పందన..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES