నవతెలంగాణ-హైదరాబాద్: కేంద్రం అప్పగించిన బాధ్యత సమర్థవంతంగా నిర్వహిస్తానని AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.తాజా నిర్ణయం ఏ పార్టీ అనుబంధానికి సంబంధించినది కాదని, బయలుదేరే ముందు తామంత మరింత వివరణాత్మక సమావేశాన్ని కలిగి ఉంటామన్నారు. ఇది ఒక ముఖ్యమైన పని, ఈ బాధ్యతను చక్కగా నెరవేర్చడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని దీమా వ్యక్తం చేశారు. ఉగ్రవాదానికి పాక్ మద్దతిస్తోందని., అంతర్జాతీయ స్థాయిలో పాక్ నిజస్వరూపాన్ని బయటపెడతామని అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు.
ఆపరేషన్ సిందూర్ చేపట్టడానికి కారణాలు, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలకు వివరించేందుకు అఖిలపక్ష బృందాన్ని పంపాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. మొత్తం ఏడుగురు సభ్యులతో కూడిన ఏడు బృందాల్లో అన్ని పార్టీలకు చెందిన ఎంపీలకు చోటు దక్కింది. ఇందులో బైజయంత్ జే పాండా బృందంలో తెలంగాణ నుంచి AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కి సభ్యునిగా చోటు దక్కింది.