నవతెలంగాణ-హైదరాబాద్: సీఎం ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్ముకశ్మీర్‌లో శాంతిభద్రత బాధ్యత లెప్ట్‌నెంట్ గవర్నర్‌దేనని, ఎన్నుకున్న ప్రభుత్వానికి ఎలాంటి సంబంధంలేదని కుండబద్దలు కొట్టారు.పహల్గాం తరహా దాడులను పసిగట్టాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, ఎల్‌జీకి మధ్య సమన్వయం తప్పనీసరి అని ఆయన సూచించారు. తమ ప్రభుత్వం టూరిజం బలోపేతానికి కృషి చేస్తుందని, ఆ రంగం అభివృద్దికి తగిన మౌలికసదుపాయలు అభివృద్ధి చేస్తామని, అందుకు తాము అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన గుల్‌ర్బాగా మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆ విహార యాత్ర ప్రదేశాలకు భద్రత కల్పించాల్సిన చర్యలు కేంద్రం, లెప్ట్‌నెంట్ గవర్నర్ తీసుకోవాలని ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్‌లో శాంతిభద్రతలను అదుపు చేసేంది ముమ్మటికి ఎల్‌జీనేనన్నారు. ఏప్రీల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడిలో 26మంది పర్యాటకులు చనిపోయిన విషయం తెలిసిందే.
జమ్మూలో శాంతిభద్రతల బాధ్యత కేంద్రనిదే: సీఎం ఒమర్ అబ్దుల్లా
- Advertisement -
- Advertisement -