Saturday, July 5, 2025
E-PAPER
Homeబీజినెస్యూఎస్‌పై ప్రతీకార సుంకాలను విధించాలి

యూఎస్‌పై ప్రతీకార సుంకాలను విధించాలి

- Advertisement -

యూఎస్‌పై ప్రతీకార సుంకాలను విధించాలి
డబ్ల్యూటీఓకు భారత్‌ ప్రతిపాదన
న్యూఢిల్లీ :
అమెరికా టారిఫ్‌ చర్యలపై భారత్‌ ఎట్టకేలకు స్పందించింది. వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యూటీఓ) నిబంధనల కింద అమెరికాపై ప్రతీకార డ్యూటీలను విధించాలని ప్రతిపాదించింది. ఆటోమొబైల్‌ రంగంపై రక్షణ చర్యల పేరుతో అమెరికా విధించిన టారిఫ్‌లపై తాజాగా ప్రతిస్పందించింది. 26 మార్చి 2025 నుండి భారతదేశం నుంచి ప్యాసింజర్‌ వాహనాలు, లైట్‌ ట్రక్కులు, నిర్దిష్ట ఆటో భాగాలపై 25 శాతం అడ్‌ వాలోరెమ్‌ టారిఫ్‌ను విధించింది, ఇవి మే 3 నుంచి అమలులోకి వచ్చాయి. ఈ చర్యలు ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తాయని భారత్‌ పేర్కొంది. ముఖ్యంగా జనరల్‌ అగ్రిమెంట్‌ ఆన్‌ ట్రేడ్‌ అండ్‌ టారిఫ్‌ (గాట్‌) 1994, సేఫ్‌గార్డ్స్‌ అగ్రిమెంట్‌కు విరుద్ధంగా ఉన్నాయని వాదిస్తోంది. ఈ టారిఫ్‌లతో భారతదేశం నుంచి యూఎస్‌కు వెళ్లే సుమారు 2,895 మిలియన్‌ డాలర్ల వార్షిక ఎగుమ తులను ప్రభావితం చేస్తాయని అంచనా. ఈ టారిఫ్‌లపై చర్చల కోసం యూఎస్‌తో సంప్రదింపులు జరపాలని డబ్ల్యూటీఓను భారత్‌ కోరింది. దీనిపై అమెరికా స్పందించాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -