Saturday, February 7, 2026
E-PAPER
Homeక్రైమ్ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని విశ్రాంత సైనికుడు మృతి

ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని విశ్రాంత సైనికుడు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని హెచ్. ఎఫ్ నగర్ ఫేజ్-1 బస్తీలో శుక్రవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. విశ్రాంత సైనిక ఉద్యోగి చెన్నకేశవులు (67) ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. మద్యం, ధూమపానం అలవాట్లున్న చెన్నకేశవులు, అనారోగ్యంతో తన భవనంపై ఉన్న గదిలో విశ్రాంతి తీసుకుంటుండగా ఈ దుర్ఘటన జరిగింది. కుటుంబ సభ్యులు, స్థానికులు మంటలు, పొగను గమనించి అక్కడికి చేరుకునేలోపే ఆయన పూర్తిగా కాలిపోయి మృతి చెందారు. సెక్టార్ ఎసై కాశయ్య ఈ వివరాలను తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -