Saturday, February 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పంచాయతీ జూనియర్ అసిస్టెంట్ కు పదవి విరమణ సన్మానం

పంచాయతీ జూనియర్ అసిస్టెంట్ కు పదవి విరమణ సన్మానం

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని హాస కొత్తూర్ గ్రామ పంచాయతీ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ గుత్తి శ్రీనివాసులు శనివారం పదవి విరమణ చేశారు. ఆయన పదవి విరమణ పురస్కరించుకొని  మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో  గుత్తి శ్రీనివాసులు పదవి విరమణ సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పదవి విరమణ పొందిన శ్రీనివాసులు సునంద దంపతులను, కమ్మర్ పల్లి సర్పంచ్ కొత్తపల్లి హారిక, ఉపసర్పంచ్ కొత్తపల్లి అశోక్ పూలమాలవేసి శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.

తన పదవి కాలంలో అత్యుత్తమ సేవలందించిన శ్రీనివాసులు శేష జీవితాన్ని ఆయురారోగ్యాలతో కొనసాగించాలని ఈ సందర్భంగా సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి సదాశివ్, మండల పరిషత్ కార్యాలయ సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఈజీఎస్ ఏపీవో విద్యానంద్,  ఉపాధి హామీ పి ఓ మండల పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్థాయి అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -