కాళేశ్వరం జోనల్ అటవీశాఖ అధికారి పి.ప్రభాకర్
నవతెలంగాణ – మల్హర్ రావు; ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ సహజమని కాళేశ్వరం అటవీశాఖ సిసిఏప్ పి.ప్రభాకర్ అన్నారు.మండలం కొయ్యుర్ పారెస్ట్ రేంజ్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న జి.రాజేశ్వర్ రావు బుధవారం పదవి విరమణ పొందారు.ఈ సందర్భంగా ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం సభ జిల్లా కేంద్రంలోని ఇల్లందు క్లబ్ లో ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యదితీగా సిసిఏప్ హాజరై మాట్లాడారు రాజేశ్వర్ రావు పదవి విరమణ పొందుతున్నది ఉద్యోగానీకే అతడు అందించే సేవలకు కాదన్నారు. అటవీశాఖలో పొందిన అనుభవాలు,సేవలు అవసరమన్నారు.దంపతులు సుఖశాoతులు,ఆయురారోగ్యాలతో శేష జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు.అనంతరం పూలమాలలు,శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో అటవీశాఖ జిల్లా అధికారి ఎం.నవీన్ రెడ్డి,ప్లాయింగ్ స్కాడ్ జిల్లా అధికారి ఎన్. జోగేoదర్,జిల్లా రిటైర్డ్ అధికారి పురుషోత్తం,అప్పల కొండ,సారయ్య,ఎం.సందీప్తోపాటు పారెస్ట్ అధికారులు పాల్గొన్నారు
ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ సహజం.!
- Advertisement -
- Advertisement -



