నవతెలంగాణ-హైదరాబాద్: ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ అధికారిక X అకౌంట్ భారతదేశంలో నిలిపివేశారు. లీగల్ డిమాండ్ కారణంగా ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామంపై రాయిటర్స్ గానీ, భారత అధికారులు గానీ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. రాయిటర్స్ ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగి ఉన్న ప్రముఖ వార్తా సంస్థ. రాజకీయాలు, వ్యాపారం, అంతర్జాతీయ వ్యవహారాలపై బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్‌లను ఈ అకౌంట్ అందిస్తుంది.
రాయిటర్స్, థామ్సన్ రాయిటర్స్ వార్తా, మీడియా విభాగం. 200 కంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ప్రాంతాల్లో 2,600 మంది జర్నలిస్టులు ఉన్నారు. భారతదేశంలో ముంబై, బెంగళూరు ,ఢిల్లీతో సహా అనేక ప్రాంతాల్లో కార్యాలయాలు రాయిటర్స్‌కు ఉన్నాయి. ఈ విషయంలో మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.