Thursday, September 25, 2025
E-PAPER
Homeతాజా వార్తలునేను సరెండర్ అయితే రేవంత్ రెడ్డి ఆత్మహత్య చేసుకుంటానన్నాడు..

నేను సరెండర్ అయితే రేవంత్ రెడ్డి ఆత్మహత్య చేసుకుంటానన్నాడు..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌- హైద‌రాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసులో ఏ4 నిందితుడు జెరూసలెం మత్తయ్య తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు గురించిన వివరాలను హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. ఓటుకు నోటు కేసులో తాను అప్పట్లోనే లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు.

అయితే, ఆ సమయంలో రేవంత్ రెడ్డి భార్య గీతారెడ్డి తనకు ఫోన్ చేశారని మత్తయ్య చెప్పారు. తాను సరెండర్ అయితే తెలుగుదేశం పార్టీ నుంచి రేవంత్ రెడ్డిని సస్పెండ్ చేస్తారని, అదే జరిగితే ఏసీబీ ఆఫీసులోనే రేవంత్ రెడ్డి ఆత్మహత్య చేసుకుంటారని ఆమె చెప్పారన్నారు. దీంతో తాను వెనక్కి తగ్గానని, అనవసరంగా ఒక ప్రాణం పోవడానికి తాను ఎందుకు కారణం కావాలని భావించానని మత్తయ్య పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -