Friday, January 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసీఎం కప్‌ పోస్టర్‌ ఆవిష్కరించిన రేవంత్‌రెడ్డి

సీఎం కప్‌ పోస్టర్‌ ఆవిష్కరించిన రేవంత్‌రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సీఎం కప్‌-2025 సెకండ్‌ ఎడిషన్‌ పోస్టర్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ నెల 17 నుంచి 22 వరకు గ్రామ స్థాయి, 28 నుంచి 31 వరకు మండల స్థాయి, ఫిబ్రవరి 3 నుంచి 7 వరకు నియోజకవర్గ స్థాయిలో పోటీలను నిర్వహిస్తారు. ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు జిల్లా స్థాయి, ఫిబ్రవరి 19 నుంచి 26 వరకు రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఐదు దశల్లో 44 రకాల క్రీడల్లో పోటీలు నిర్వహించ నున్నారు. ఎంట్రీలు, ఇతర వివరాలను త్వరలో వెల్లడించనున్నట్టు క్రీడా శాఖ అధికారులు తెలిపారు. పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో క్రీడాశాఖా మంత్రి వాకిటి శ్రీహరి, శాట్స్‌ చైర్మన్‌ శివసేనా రెడ్డి, స్పెషల్‌ సీఎస్‌ జయేష్‌ రంజన్‌, సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్రీనివాసరాజు, ఎస్‌ఏటీజీ ఎండీ సోనీబాల తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -