Saturday, April 4, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరేవంత్‌రెడ్డీ.. ఏ హామీలు అమలు చేసినవ్‌?

రేవంత్‌రెడ్డీ.. ఏ హామీలు అమలు చేసినవ్‌?

- Advertisement -

విజయన్‌ ప్రభుత్వంపై కించపరిచే వ్యాఖ్యలు తగవు: సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

తెలంగాణలో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నామనీ, కావాలంటే వచ్చి చూడాలని కేరళం మంత్రి వర్గానికి రేవంత్‌రెడ్డి సవాల్‌ విసరడం విడ్డూరంగా ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఏం అమలు చేశావో కేరళంలో కాదు ముందు రాష్ట్ర ప్రజలకు, తెలంగాణలోని సీపీఐ, సీపీఐ(ఎం) నేతలకు వివరించాలని డిమాండ్‌ చేశారు. విజయన్‌ ప్రభుత్వంపై రేవంత్‌రెడ్డి కించపరిచే వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుబట్టారు. శుక్రవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తులంబంగారం, జాబ్‌క్యాలెండర్‌, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు, కౌలు రైతులకు రూ.15 వేలు, మహిళలకు ప్రతి నెలా రూ.2,500, పింఛన్‌ రూ.4,116, తెలంగాణ ఉద్యమకారులకు 200 గజాల ఇంటి స్థలం, నిరుద్యోగ భృతి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కేరళం రాష్ట్రానికి వెళ్లి తెలంగాణలో ఏవో అద్భుతాలు చేసినట్టు అసత్యాలు వల్లించడం తగదని హితవు పలికారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -