Saturday, July 5, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్ రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..

 రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. 20 మంది విద్యార్థులు ఉంటే చాలు.. ఆ ఏరియాలో ప్రభుత్వ పాఠశాల లేనట్టైతే వెంటనే ప్రాథమిక పాఠశాలను ప్రారంభించాలని ఆదేశించింది.

మొదటి విడతలో 94 స్కూల్స్ పట్టణ ప్రాంతాల్లో, 63 ప్రైమరీ స్కూల్స్ గ్రామీణ ప్రాంతాల్లో వెంటనే ప్రారంభించాలని ఆదేశించింది. 20 కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న ప్రభుత్వ / స్థానిక సంస్థల పాఠశాల అందుబాటులో లేని గ్రామీణ ఆవాసాలు / పట్టణ కాలనీలు / వార్డుల లో ప్రైమరీ స్కూల్స్ అందుబాటులో ఉన్న ప్రభుత్వ గృహాలలో లేదా అద్దె వసతి గృహాలలో పాఠశాలలను వెంటనే ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని డిఇఓ లకి ఆదేశాలు జారీ చేసింది.

ఫర్నిచర్, స్టేషనరీ, విద్యా సామగ్రి, ఇతర వస్తువులకు అవసరమైన బడ్జెట్‌ను డీఎస్ఈ ద్వారా జిల్లా కలెక్టర్లకు విడుదల చేయనుంది. 212 గ్రామీణ ఆవాసాలలో 359 పట్టణ కాలనీలు / వార్డులలో ప్రాథమిక పాఠశాలల ఏర్పాటు కానున్నాయి. మొత్తం 571 కొత్త ప్రైమరీ స్కూల్స్ అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో పేద విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉండనున్నది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -