నవతెలంగాణ-హైదరాబాద్: 42శాతం బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కీలక భేటీ నిర్వహించారు. రాష్ట్ర హైకోర్టు నిర్ణయంపై సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. జీవో నెంబర్ 9 అమలు సాధ్యసాధ్యాలపై దేశ ఉన్నత న్యాయస్థానంలో సమగ్రమైన పిటిషన్ వేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. జూమీ మీటింగ్ లో భాగంగా పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పలువురు మంత్రులు పాల్గొన్నట్లు సమాచారం.