నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని కౌలాస్ నాలా ప్రాజెక్టును జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ , రెవెన్యూ ఇన్స్పెక్టర్ రామ్ పటేల్ బుధవారం నాడు ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎగువన మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాలలో వర్షాలు భారీగా పడుతుండడంతో ఎగువ నుండి దిగువ ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చి చేరుతోందని ప్రాజెక్టు అధికారుల సమాచారం తెలిసింది. అందుకనుగుణంగా దిగువన ఉన్న మంజీర ప్రాంతంలోకీ వరదనీరు వచ్చే ప్రాంతాలలో ప్రజలు పశువుల కాపరులు రైతులు అప్రమత్తంగా ఉండాలని అటువైపు ఎవరు వెళ్లకుండా గ్రామాలలో చాటింపు వేయాలని వారు సూచించారు. అనంతరం ప్రాజెక్టు అధికారులతో ప్రాజెక్టు యొక్క నీటిమట్టం వచ్చి చేరుతున్న నీరు వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్ , ఆర్ఐ రామ్ పటేల్, ఎంపీఓ రాము, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.