- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
పట్టణ కేంద్రంలోని ఐకేపీ కార్యక్రమం ఆధ్వర్యంలో ఎపిఎం సాయిలు విఓఏల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకు లింకేజీ టార్గెట్ ప్రకారం ప్రతీ స్వయంసహాయక సంఘానికి ఋణాలు అందించాలన్నారు. ఎన్.పి.ఎ రికవరీ చేసి ఎస్.హెచ్.జి లను ఢిఫాల్ట్ లేని మండలంగా తీర్చలన్నారు. జీవనోపాధి ప్రాజెక్టుల గ్రౌండింగ్‌ను పూర్తిచేయాలని, ఇందిరమ్మ ఇళ్ల కోసం లబ్ధిదారులకు అవసరమైన ఋణం అందించాలని సూచించారు. విఓ లకు నేషనల్ యాప్ మేరీ పహచాన్ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, వివో ఏలు పాల్గొన్నారు.
- Advertisement -



